ప్రధాన రహదారి కల్వర్టు పనులు పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం లో చిల్కానగర్ ప్రధాన రహదారి లో 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించిన చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్. జిహెచ్ఎంసి అధికారు లతో మాట్లాడుతూ బాక్స్ డ్రైన్ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని, బాక్స్ డ్రైన్ పనులను త్వరతగతిన పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పల్ నుండి చిల్కానగర్ నుండి ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించే రోడ్డు కాబట్టి మరియు వేరే ప్రాంతాల కు వెళ్లడానికి కూడా ఇది ప్రధాన రహదారి కాబట్టి అధికారులు దీనిపై అధిక చొరవ చూపి వీలైనంత తొందరలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, బాణాల నారాయణరెడ్డి, షఫీ, గడ్డ బాలు ,బంటి గౌడ్ వర్క్ ఇన్స్పెక్టర్ కేదార మొదలగు వారు పాల్గొన్నారు.


Comments