సత్తుపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.!
మహిళలతో కలిసి ఆడిపాడారు, ఎమ్మెల్యే రాగమయి – దయానంద్ దంపతులు.
సత్తుపల్లి, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ దంపతులు కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వేలాది మంది మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొన్నదని మట్టా దయానంద్ పేర్కొన్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, స్థానిక అధికారులు, కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..jpeg)


Comments