కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ర్యాలీ

కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ ర్యాలీ

చిలుకానగర్, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పండుగ బతుకమ్మ సంబరాల సందర్భంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు చిలుకానగర్ డివిజన్ మహిళలు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యం వహించారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల ప్రకారం ఈ ర్యాలీ నిర్వహించబడింది.WhatsApp Image 2025-09-25 at 5.54.07 PM (1)
ఈ సందర్భంగా కార్పొరేటర్ గీత ప్రవీణ్ మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ప్రత్యేక ఉత్సవం. ఈ పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కే.సి.ఆర్. దే. నేడు బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు” అని తెలిపారు.కార్యక్రమంలో డివిజన్ మహిళా నాయకురాళ్లు, బిఆర్ఎస్ కార్యకర్తలు, వందలాది మహిళలు పాల్గొని బతుకమ్మ పాటలతో, రంగురంగుల బతుకమ్మలతో ఉత్సవాలను సందడిగా మార్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .