బతుకమ్మ చీరెలను రాష్ట్ర మహిళలందరికీ దసరా కానుకగా ఇవ్వాలి.

సిపిఐ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి.

బతుకమ్మ చీరెలను రాష్ట్ర మహిళలందరికీ దసరా కానుకగా ఇవ్వాలి.

హసన్ పర్తి,సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు):

 రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ కానుకగా మహిళలకు ఇస్తున్న చీరలను తెలంగాణలోని  మహిళలందరికీ ఇచ్చి గౌరవించాలని మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున హసన్ పర్తి మండల కేంద్రంలో  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మహిళా పొదుపు సంఘాల  సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఇది ఎంత మాత్రం మంచిది కాదని కొంతమంది మహిళలకు ఇచ్చి, కొంతమంది ఇవ్వకుండా ఉండటం వారిని అవమానించటమేనని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పిదాన్ని గుర్తించి రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా కానుకగా చీరెలను పంపిణీ చేయాలని  కోరారు. ఈ విషయాన్ని  పాలకులు గుర్తించాలని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో దొమ్మాటి ప్రవీణ్ కుమార్,కౌసల్య,రమా,అక్షయ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .