ఉపాధ్యాయుడి జ్ఞాపకార్థంగా బెంచీలు ఏర్పాటు

---- 2007-2008 బ్యాచ్ విద్యార్థులు

ఉపాధ్యాయుడి జ్ఞాపకార్థంగా బెంచీలు ఏర్పాటు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

గురువులను గౌరవించడం అందరి బాధ్యత అని వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-2008 పూర్వ విద్యార్థులు అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలం వెల్టుర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2007-2008 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయుడి జ్ఞాపకార్థంగా బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు రాజశేఖర్ చారి మా మధ్య లేకపోయినా గురువు జ్ఞాపకార్థంగా స్నేహితులందరం కలిసి మూడు బెంచీలను గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలోనీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 2007-2008 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .