ఆర్టీసీలో మీసేవలు శెభాష్....అందుకోండి మా అభినందనలు
------ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ అభినందన సభలో ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో పనిచేసి ఆరోగ్యంగా సంస్థ నుండి ఉద్యోగ విరమణ పొందుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సేవలను "శభాష్ మీ సేవలు అందుకోండి అభినందనలు" అంటూ ఖమ్మం డిపో మేనేజర్ ఉద్యోగులను అభినందించారు. శనివారం సాయంత్రం ఖమ్మం నూతన బస్ స్టేషన్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిపో మేనేజర్ పి.దినేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులను పూలదండలు,పుష్పగుచ్చాలు,జ్ఞాపికలు,బహుమతులతో ఘనంగా సన్మానించారు. ముందుగా సంస్థ యాజమాన్యం తరఫున సన్మాన పత్రం మరియు బహుమతిని ఇచ్చి శాలువాతో డిపో మేనేజర్ దినేష్ కుమార్ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ జయరాజు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రామయ్య లు ఘనంగా సన్మానించారు.సన్మానం పొందిన వారిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆకుతోట శ్రీనివాసరావు,రాజ్యలక్ష్మి కంట్రోలర్ చిరుమనేని రామయ్య,వెంకటరత్నమ్మ, మరియు కండక్టర్లు వినుకొండ రామయ్య,రజిని పగడికత్తుల నాగేశ్వరరావు,కమల పొనుగోటి సీతారామారావు, లక్ష్మి దంపతులు ఉన్నారు. తమను ఘనంగా సన్మానించిన ఆర్టీసీ అధికారులకు,ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులకు బంధుమిత్రులకు సన్మాన గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కుటుంబ సభ్యులు సహకరించి వారికి ఏ విధమైన లోటు రాకుండా చూడాలని డిపో మేనేజర్ కుటుంబ సభ్యులకు సూచించారు.వాస్తవంగా ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఉన్నత విద్యల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ రాణిస్తున్నారని తమ తల్లిదండ్రుల కష్టాన్ని,పనితనాన్ని చూసి పిల్లలు రాణించటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.రిటైర్మెంట్ తర్వాత తమ విశ్రాంత జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక విషయాలను,ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు. ప్రణాళికాబద్ధమైన జీవనం ద్వారా సంపూర్ణ జీవితాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజారవాణా సంస్థలో సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలు ఆదర్శవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులను తోటి ఉద్యోగులు బంధుమిత్రులు,కుటుంబ సభ్యులు శాలువాలు, పూలదండలు,జ్ఞాపికలతో ఘనంగా ఆత్మీయంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పి. దినేష్ కుమార్,అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రామిశెట్టి రామయ్య,ఆఫీసు సూపరింటెండెంట్ జయరాజు మరియు ఉద్యోగ,కార్మిక సంఘాల నాయకులు గడ్డం లింగమూర్తి,ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు,దమ్మాలపాటి శ్రీనివాసరావు,అప్పన పురుషోత్తమ రావు,కొమ్ము వినోదరావు,గుండు మాధవరావు,చావా రమేష్,గుగ్గిళ్ళ రోశయ్య,హెచ్చు బసవయ్య రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు తోకల బాబు,సామినేని శ్యామ్ సుందర్ర్రావు,కందుల వెంకటేశ్వర్లు,జంగం వెంకటేశ్వర్లు, తిప్పారెడ్డి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments