మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. 
గురువారం హనుమకొండ జిల్లా  కమలాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముప్పై పడకల ఆసుపత్రిలో ఔట్ పేషంట్ విభాగాన్ని పరిశీలించారు. ప్రతి రోజు వైద్య సేవల కోసం ఎంతమంది వస్తున్నారు, ఆసుపత్రి కి సంబంధించిన వాహనాలు ఎన్ని ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాటి పరిస్థితి ఏంటి, ఆసుపత్రి లో తాగునీటి పరిస్థితి, ఎక్కడి నుండి వస్తుందనే వివరాలతో పాటు ప్రసూతి సేవల విభాగాలను పరిశీలించిన కలెక్టర్, ఆస్పత్రికి సంబంధించిన విషయాలను  వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, మందుల విభాగాలను కలెక్టర్ తనిఖీ చేశారు. 


WhatsApp Image 2024-12-05 at 9.37.13 PMఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రి లో సాధారణ ప్రసవాలు అయ్యేట్టు చూడాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలని ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అప్పయ్య, డిఆర్డీఓ పి.డి. శ్రీనివాస్, స్థానిక వైద్యాధికారి  డాక్టర్ నరేష్, వైద్య సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .