జవహర్ నగర్‌లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ
జవహర్ నగర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (ఐపీఎస్) ఆదేశాల మేరకు, పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జవహర్ నగర్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైరింగ్ కట్ట వరకు కొనసాగి, మార్గమంతా పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం నినాదాలు, జాతీయ జెండాలతో కదిలింది. విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జవహర్ నగర్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య మాట్లాడుతూ “రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగం స్ఫూర్తిదాయకం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం” అన్నారు.ర్యాలీలో ఎస్సైలు ఇద్రిస్ అలీ, రాము నాయక్, వేణుమాధవ్, మౌనికతో పాటు జవహర్ నగర్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments