బీసీ బందుకు బీజేపీ సంపూర్ణ మద్దతు
నాగారం, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
బీసీ సంఘాల పిలుపుమేరకు తెలంగాణలో శనివారం రోజు నిర్వహించిన బందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నాగారం మున్సిపల్ పరిధిలో పార్టీ ఆదేశాల మేరకు, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి బందులో పాల్గొన్నారు.కౌకుంట్ల చంద్ర రెడ్డి మాట్లాడుతూ, “మోసపూరిత వాగ్దానాలతో 22 నెలలుగా 420 హామీలలో ఏ ఒక్కటినీ పూర్తి అమలు చేయని కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కోర్టులను అవమానిస్తూ హైకోర్ట్, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం ద్వారా బీసీ సంఘాలతో ఎంత చలగాటమాడిందో ప్రజలు తెలుసుకుంటారు” అన్నారు.బీసీ సంఘాలు ఈ బందును కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అని పేర్కొని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ కాంగ్రెస్‌పై చర్యలు కొనసాగిస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బుజ్జా శ్రీనివాస్ గౌడ్, రామక్కపేట రవీందర్ రెడ్డి, నక్క కిషోర్ గౌడ్, ముద్రగణం శ్రీనివాస్, సతీష్ రెడ్డి, జూపల్లి నరేష్, వెంకటేశ్వరరావు రమేష్ సతీష్ మరియు బీజేపీ కార్యకర్తలు, మున్సిపల్ ప్రజలు పాల్గొని బందును విజయవంతంగా చేపట్టారు.


Comments