మల్కిమియన్ పల్లి లో ఘనంగా బోనాల పండుగ
గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు రవినాయక్
ఘనపూర్,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు) :
వనపర్తి జిల్లా ఘనపూర్ మండల పరిధిలోని మల్కిమియన్ పల్లి గ్రామం లో, మంగళవారం గంగమ్మ తల్లి నల్ల పోచమ్మ అమ్మవారు వనకన్యలు పోతురాజుల నృత్యాలు పలువురి ఆకట్టుకున్నాయి
సెల్ఫీలతో పలువురు భక్తులు పోటీపడ్డారు. శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవస్థానం లో, శ్రావణ మాస బోనాల జాతర ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం నిర్వహించుకున్నారు. ముందుగా గ్రామస్తులు, పోచమ్మ దేవాలయం వెళ్లి పూజా అనంతరం రథంపై కూర్చున్న అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా బోనాలు సమర్పించడం మహిళలు ఆటపాటలతో నాట్యాలు చేస్తూ బయలుదేరిన భక్తులు. దారి పొడుగునా వేషధారణలు, పోతురాజుల నృత్యాలతో, ఊరేగింపుగా శ్రీ పోచమ్మ అమ్మవారికి ఆలయ వద్దకు చేరుకొని మొక్కులు సమర్పించుకున్న భక్తులు. ఈ కార్యక్రమంలో ఎం.రవి నాయక్ మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి నల్ల పోచమ్మ వానకన్యలు పోతురాజుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయని, అంగరంగ వైభవంగా శ్రావణమాస బోనాల జాతరలొ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించినారని మైసమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ వంటి పేర్లతో పిలిచే పోచమ్మ తల్లిని మహంకాళి అవతారంగా భావిస్తారని, శ్రావణ మాసంలో పోచమ్మ తల్లికి మహిళా భక్తులు ఉపవాసాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత భక్తిశ్రద్ధలతో పలువురు భక్తులు బోనాలు సమర్పిస్తారని చూడడానికి పక్కగ్రామాలతో పాటు, గ్రామ ఆడపడుచులు, వారి బంధువులు, పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో సుఖశాంతులు కలగాలని అమ్మవారి దీవెనలు మా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని జిల్లా దిశ కమిటీ మెంబెర్ రవి నాయక్ కోరుకున్నారు.


Comments