బోస్టన్ మారథాన్ అర్హత సాధించిన నాగభూషణం రావును సత్కరించిన
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మల్లాపూర్, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ వాసి చాలమలశెట్టి నాగభూషణం రావు 74 ఏళ్ల వయసులో అమెరికా బోస్టన్‌లో జరగనున్న 130వ అంతర్జాతీయ బోస్టన్ మారథాన్ రేసుకు అర్హత సాధించడం గర్వకారణమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌తో కలిసి నాగభూషణం రావును శాలువాతో సత్కరించారు.ఎమ్మెల్యేమాట్లాడుతూ“వృద్ధాప్యంలో కూడా అంతర్జాతీయ మారథాన్‌కి అర్హత సాధించడం యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన క్రమశిక్షణ, శారీరక సామర్థ్యం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శం. యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అన్నారు.అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున మరిన్ని మారథాన్ పోటీల్లో పాల్గొని దేశానికి కీర్తి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో మహేందర్ రెడ్డి, చిగుళ్ల శ్రీనివాస్, తండా వాసు గౌడ్, కుంటి కృష్ణ, ధర్మారెడ్డి, అల్లాడి కృష్ణ యాదవ్, యాకుబ్ రెడ్డి, ఉస్మాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments