బి ఆర్ అంబేద్కర్ భారతదేశ ప్రజాస్వామ్య మార్గదర్శ నిర్దేశకుడు
-బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
అఖిలభారతవ యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య,జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల నుండి అట్టడుగున సామాజిక స్పృహకు దూరమైన బహుజనులకు ఈ దేశంలో సామాజిక న్యాయం అందించాలని తపనతో పోరాటం చేసిన మహా వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వారు చూపిన మార్గ నిర్దేశికత్వం వల్లనే బడుగు బలహీన వర్గాల వారు రాజకీయ సామాజిక, చైతన్యం కలిగి ఉన్నారని, రిజర్వేషన్ల కొరకు కేంద్ర ప్రభుత్వం తోనే పెద్ద యుద్ధం చేశారని, ఈ దశలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, కేంద్ర మంత్రి పదవిని సైతం త్యాగం చేసి మనకు మంచి భవిష్యత్తును ఇచ్చారని, అలాంటి వ్యక్తి ఈ దేశంలో సూర్యచంద్రులు ఉన్నంతవరకు నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకదాని కోటేశ్వరరావు తెల్లబోయిన రమణ, పొదిలి భూపతి రాగం బాబు కనక బండి విజయలక్ష్మి , మేడిదల తిరుపతిరావు ఫంకు మురళి, నన్నె బొయిన సాంబశివరావు మరియు తదితరులు పాల్గొన్నారు


Comments