మోతె బాబు దశదిన కర్మలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

మోతె బాబు దశదిన కర్మలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన మోతె బాబు ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం నిర్వహించిన దశదిన కర్మలో బిఆర్ఎస్ నాయకులు ఎర్ర అశోక్, బొల్లెపాక సంపత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోతె బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం నాయకులు మోతె బాబు కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మోతె బాబును స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నల్ల మమత రవి,బాణాల మౌనిక కుమార్,నాయకులు నల్ల రాజేంద్ర ప్రసాద్,పట్ల రమేష్,బొల్లెపాక రమేష్,ఎడ్ల వంశీ,నల్ల వేణు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .