పెనుబల్లిలో బిఆర్ఎస్ పార్టీ శక్తి ప్రదర్శన.

స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.

పెనుబల్లిలో బిఆర్ఎస్ పార్టీ శక్తి ప్రదర్శన.

పెనుబల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

 పెనుబల్లి మండల కేంద్రంలోని సప్తపది ఫంక్షన్ హాల్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల సన్నాహా సమావేశం వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షత వహించారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారం కోసం గ్రామస్థాయిలో బలమైన బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజలకు నిజాలు తెలియజేసే బాధ్యత మనదే. గ్రామస్థాయిలో చర్చలు, సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుంచాలి, అని సండ్ర తెలిపారు.

స్థానిక ఎన్నికల నిర్వహణలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని ప్రధానంగా పరిగణించాలన్నారు. యువత, మహిళలు, రైతులు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బిఆర్ఎస్ శక్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో పలువురు మండల స్థాయి నాయకులు మాట్లాడుతూ, సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి గ్రామస్థాయిలో విపరీతమైన మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, యువత విభాగం, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20251006-WA0010

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .