పాత మసీదు స్థలంలో షాదీఖానా నిర్మించండి
అనుమతి లేకుండా ఇండ్లమధ్య మసీదు ఏర్పాటు బాధాకరం
విలేకరుల సమావేశంలో బాధితుడు
మహబూబ్ అలీ ఆవేదన
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం నగరం 14వ డివిజన్ లోని గొల్లగూడెం బొడ్రాయి సెంటర్ లో ఇండ్లమధ్య నిర్మించబడిన పాత మసీదు స్థలంలో షాదీఖానా, ఉర్దూ మదర్షా, కమ్యూనిటీహాల్ లాంటివి నిర్మించి ముస్లిం ప్రజలందరికి ఉపయోగపడేవిధంగా చేయాలని గొల్లగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ ఆలీ కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ ఆలీ మాట్లాడుతూ... ఖమ్మం నగరం 14వ డివిజన్ (గొల్లగూడెం) లోని బొడ్రాయి సెంటర్ లో ఇళ్ల మధ్యలో మా ఇంటిని అనుకోని ఉన్న పాత మసీదును తొలగించి అనుమతులు లేకుండా మాకు ఇబ్బంది కలిగే విధంగా మా ఇంటి వైపు పెద్ద పెద్ద కిటికీలను, మెట్లను నిర్మించడం వలన ఇంట్లో స్త్రీలు బయటికి వచ్చి స్వేచ్ఛగా పనిచేసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మజీద్ స్థలం చాలా తక్కువగా ఉన్నదని భావించి ముస్లిం పెద్దలు, ముస్లిం ప్రజలు ఈ మజీద్ కు అతి సమీపంలో కేవలం 150 అడుగుల దూరంలో కొత్త మసీదును నిర్మించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలో చేస్తున్నారన్నారు. మళ్లీ పాత మసీదు స్థలంలో అనుమతులు లేకుండా మా ఇంటిని అనుకోని మాకు ఇబ్బంది కలిగే విధంగా మసీదు నిర్మాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాత మసీదు ఉన్నప్పుడు మైకుల ద్వారా భారీ శబ్దాలతో ఆజా, శుక్రవారం భక్తి ప్రసంగాలు చేసేటప్పుడు మా ఇంట్లో పిల్లలు, వృద్ధులు, స్త్రీలు మేమంతా ప్రశాంతంగా ఉండలేక చాలా ఇబ్బందుల పాలై మానసికంగా, శారీరకంగా, గుండె జబ్బుల పాలై కష్టాలు పడుతున్నామని బాధను వ్యక్తం చేశారు. ఈ మసీదును మా ఇంటి ఆనుకొని కనీస దూరం పాటించకుండా నిర్మించవద్దని కమిటీ వారిని ప్రాధేయపడ్డ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఖమ్మం నగర మునిసిపల్ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఈ విషయమై పిర్యాదు చేశామన్నారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి మా బాధను అర్ధం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.


Comments