రూ. 59లక్షల వ్యయం తో   సి.సి. రోడ్ల పనులు ప్రారంభించినరు 

కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి

రూ. 59లక్షల వ్యయం తో   సి.సి. రోడ్ల పనులు ప్రారంభించినరు 

కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:

కాప్రా డివిజన్ లో ఎన్.ఆర్.ఐ కాలనీ లో రూ. 59లక్షల వ్యయం తో అంతర్గత సి. సి. రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాన. కార్పొరేటర్  స్వర్ణరాజ్  శివమణి. మాట్లాడుతూ - ఎన్.ఆర్.ఐ కాలనీ  ఏర్పడి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్న నేపధ్యంలో కాలనీ వెంచర్ ఏర్పాటు సమయంలో నిర్మించిన అంతర్గత రోడ్లు-గుంతల మయమై కాలనీ వాసులు మరియు పరిసర కాలనీ వాసుల అవస్థలు పడ్డారని, తాను ఈ సమస్యని జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రూ. 59లక్షల నిధులు మంజూరు చెయించి, రోడ్డు నిర్మాణపనులు ప్రారంభిస్తున్నానన్నారు. అలాగే ఇటీవల కాలంలో పునరుద్దరించి సుందరికరించి న పార్క్ ను పరిశీలించారు.  ప్రథమపురి కాలనీ లో రూ. 32.30లక్షల వ్యయం తో సి సి రోడ్లు నిర్మిచామని, షిరిడీ కాలనీలో  సిసి రోడ్ల నిర్మాణం కొరకు రూ.56 లక్షలు మంజురు చేయించామని.
 
శ్రీసాయిబాబా నగర్ ఆర్ టి సి కాలనీ లో సి సి రోడ్ల నిర్మాణం కొరకు రూ. 48లక్షలు, వినాయక నగర్ కాప్రాలో రూ18.80లక్షలు సి సి రోడ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. 
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్  మందుముల పరమేశ్వర్ రెడ్డి. ఈ నిధులను మంజూరు చేయించి డివిజన్ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఉప్పల్ ఇంచార్జ్  పరమేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్  స్వర్ణ రాజ్ శివమణి.హైటెన్షషన్ రోడ్డు లోని నందిని హాస్పిటల్ నుండి కట్టమైసమ్మ గుడి వరకు,
 సైనిక్ పురి హెచ్ పి పెట్రోల్ బంక్ నుండి కాప్రా జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రక్కన బొడ్రాయి వరకు,  దాబా గార్డెన్ నుండి విద్యభారతి హైస్కూల్ వరకు ప్రధాన రహదారుల నిర్మాణం కొరకు రూ1,78,50,000/-(కోటి డెబ్భైఎనిమిది లక్షల యాభై వేలు) ప్రత్యేక నిధులు మంజూరు చేయించారని తెలిపారు.  

ముఖ్యమంత్రి   అనుముల రేవంత్ రెడ్డి దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగవంతం గా జరుగుతున్నాయని,
 డివిజన్ పరిధిలో కాలనీలు, బస్తీల అభివృద్ధికి తాను నిర్విరామంగా కృషి చేస్తున్నానని, డివిజన్ ప్రజల ఆదరణ, ఆశీస్సులే  తాను ప్రజాసేవలో ఉత్తమ నాయకునిగా సేవలందించడానికి ప్రేరణ అని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఎన్.ఆర్.ఐ కాలనీ అధ్యక్షులు  నాగేశ్వర్ రావు  మాట్లాడుతూ- కాలనీ ఏర్పడి నాటి రోడ్లు, త్రాగునీరు, పార్క్ అభివృద్ధి వంటి సమస్యలను  కాప్రా డివిజన్ కార్పొరేటర్  స్వర్ణరాజ్ శివమణి కి విన్నవించిన సందర్భంలో వారు మా కాలనీవాసులకు  సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఒక్కొక్కటిగా అనగా ముందు త్రాగునీటి సదుపాయం కల్పించి త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. తర్వాత పార్క్ అభివృద్ధి పరిచి సుందరీకరించి ఆహ్లాధకరమైన పార్క్ ను నిర్మించారు. 

రూ. 59లక్షల వ్యయం తో అంతర్గత ప్రధాన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి మా ఎన్ ఆర్ ఐ కాలనీ వాసులకు గతంలో తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్  స్వర్ణ రాజ్ శివమణి  వంటి అరుదైన నాయకులే నేటి సమాజానికి అవసరమని వారికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని, కార్పొరేటర్ కి ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కాప్రా డివిజన్ అధ్యక్షులు  కొబ్బనూరి నాగశేషు ,  ఎన్ ఆర్ ఐ కాలనీ, షిరిడీ సాయి కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీ, వినాయక నగర్ కాలనీల రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .