మనందరి కృషితోనే సమాజంలో మార్పు 

-అస్పియా అంజుమ్ 

మనందరి కృషితోనే సమాజంలో మార్పు 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 మనందరి కృషితోనే సమాజంలో మార్పు సంభవిస్తుందని అందుకుగాను మనమంతా సంఘటితంగా నిర్విరామ కృషి చేయాలని జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం ఖిల్లా అధ్యక్షురాలు ఆస్పియా అంజుమ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా " నైతికతే నిజమైన స్వేచ్ఛ " అంశంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జాగృతి ఉద్యమంలో భాగంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు ఆస్పత్రులను సందర్శించి డాక్టర్లను , పలు పాఠశాలలు సందర్శించి ప్రిన్సిపాల్ లను కలుసుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై స్వచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవులలో నైతిక విలువలు పతనం కావడానికి భయభక్తులు లోపించడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజం నైతిక సంక్షోభంలో చిక్కుకొని అశాంతి , ఆలజడు లకు గురవుతుందన్నారు .మన నైతిక ,సామాజిక బాధ్యతల ప్రకారం చిన్నప్పటి నుండే పిల్లలకు నైతిక విలువల గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పతనమవుతున్న సమాజం లో మార్పు కోసం జమాతే ఇస్లామీ హింద్ ప్రచార ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు. సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందని చెప్పారు .తాము నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జమాతే ఇస్లామీ హింద్ మహిళ విభాగం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్, సభ్యులు సుమయ్య తరున్నం , నూరి హప్ష,ఫైజా ఇరం , సీమ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .