రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి - మాజీ ఎంపీ నామ

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి - మాజీ ఎంపీ నామ

రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి - మాజీ ఎంపీ నామ

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 25, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం కార్పొరేషన్, మమతా హాస్పిటల్ ప్రాంగణం లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యాలయంలో రాబోయే స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం నాడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో
టౌన్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, గ్రామాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రతి గల్లీ తిరిగానని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఖమ్మం అసెంబ్లీ అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రఘునాథపాలెం మండలానికి జిల్లాలోనే అత్యధిక రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోనే ఖమ్మంకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, తిరిగి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రమించాలని నామ పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన ప్రతి ఓటరింటికీ వెళ్లి కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, పువ్వాడ అజయ్ మంత్రి గా చేసిన కృషి, తాను ఎంపీగా సాధించిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం రెండో ఏడాదికి చేరుకుంటున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు బాధ్యత అని ఆయన అన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. రైతుల సమస్యల విషయంలో కెసిఆర్ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత రాకుండా చూసుకున్నారని, కరోనా తర్వాత కేసీఆర్ సూచన మేరకు పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించి యూరియా కొరత లేకుండా రైలు వ్యాగన్ల ద్వారా యూరియా ను రాష్ట్రానికి తెప్పించారని వివరించారు. రైతుల కోసం నాడు గోడౌన్ సామర్థ్యం పెంచి, ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచిన బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును తెలియజేశారు. ఇటివల సోషల్ మీడియాలో ప్రజలే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారని ఇది ప్రభుత్వ పని తీరుకు అద్దం పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మాజీ మార్కెట్ చైర్మన్ అర్జెసీ కృష్ణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి, మాజీ జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఖమర్,బిఆర్ఎస్ మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డీప్యూటీ ప్లోర్ లీడర్ మక్బుల్, మండల అధ్యక్షులు వీరు నాయక్,మాజీ వైస్ ఎంపిపి గుత్తా రవి,నాయకులు మెంతుల శ్రీశైలం,
అమరగాని వెంకన్న, హరిప్రసాద్, లక్ష్మణ్ నాయక్ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.WhatsApp Image 2025-09-25 at 9.06.28 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .