ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడి ఘోరం: రాష్ట్ర నేతల ఆవేదన.
సత్తుపల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
దేశ చరిత్రలో చీకటి రోజు గా గుర్తించదగిన సందర్భంలో, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం, ధర్మం వైపు నడుస్తున్న గౌరవప్రదమైన వ్యక్తి పై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలచివేసే ఘటనగా ఉందని వారు తెలిపారు. ఇలాంటి దాడులు, బెదిరింపులు వారిపై ప్రభావం చూపవు అని, యావత్ దేశం గుర్తించవలసిన అంశమని పేర్కొన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి, దాడి చేసిన వ్యక్తి వెనక ఉన్న శక్తులకు తగిన బుద్ధి చెప్పి, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వారిని రక్షించడం, న్యాయ వ్యవస్థ సురక్షితంగా ఉండడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


Comments