చిల్కానగర్ మోడల్ వైకుంఠధామం త్వరలో అందుబాటులోకి
కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్
చిల్కానగర్, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
చిల్కానగర్ డివిజన్‌లో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మోడల్ వైకుంఠధామం పనులు త్వరితగతిన పూర్తి కానున్నాయని కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి శనివారం ఆమె నిర్మాణ పనులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన గీతా ప్రవీణ్ ముదిరాజ్, “ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వైకుంఠధామాన్ని డిసెంబర్ చివరి నాటికి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తాం. బర్నింగ్ ప్లాట్‌ఫాం, బాత్రూమ్స్, దింపుడు గళం, పూజా మందిరం, శివాలయం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి” అని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా వైకుంఠధామం పరిసరాల్లో పిచ్చిమొక్కలను తొలగించి, నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో టిఆర్ఎస్పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎదుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, మాస శేఖర్, చేర్యాల శ్రీనివాస్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 


Comments