అకాల వర్షాలకు కూలిన ఇండ్ల ను పరిశీలించిన చిన్నారెడ్డి
వనపర్తి, ఆగస్టు20(తెలంగాణ ముచ్చట్లు):
అకాల వర్షాలకు కూలిన ఇండ్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పరిశీలించారు. బుధవారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాలలో కూలిన ఇండ్లను ఆయన పరిశీలించారు. పరిశీలించి వనపర్తి జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో పెద్దమందడి మండలం లో జంగమయ్య పల్లె గ్రామానికి చెందిన బోయ అంజయ్య, దొడగుంటపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సాయి భార్గవి రాజశేఖర్ శెట్టి, మోజర్ల గ్రామంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు దయాకర్వాళ్ల ఇల్లు కూలిపోయిన విషయం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని కూలిన ఇండ్లను పరిశీలించారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ..ఇల్లు కూలిన కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అదృష్టం అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని ఇల్లు కూలిన బోయ అంజయ్య, సాయి భార్గవి రాజశేఖర్ శెట్టి, గట్టు దయాకర్ వాళ్ల కు ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు.జిల్లా కలెక్టర్ తో,ప్రభుత్వ రెవిన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయని ఇండ్లు కూలిన వారికి అందజేయాలని సూచించారు.పెద్దమందడి మండల ఎంపీడీవో తో మాట్లాడి షిథీల అవస్థలో ఉన్న ఇండ్లకు,నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, పెద్దమందడి బీసీ సెల్ అధ్యక్షుడు రఘు, సీనియర్ నాయకులు బాల్ చందర్, రాఘవేంద్ర రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు


Comments