సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం 

ఎమ్మెల్యే బండారి, కార్పొరేటర్ బన్నాల

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం 

చిల్కానగర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)

చికిత్స ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆశ్రయం అవుతోంది. చిల్కానగర్ డివిజన్ గణేష్‌నగర్ నివాసులు మల్లేష్, సంధ్యలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కును చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ సోమవారం అందజేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్, సంధ్యలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ గీతా ప్రవీణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించాలని కార్పొరేటర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, చర్యల శ్రీనివాస్, శ్యామ్, బంటి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .