జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాహుల్ రాజ్.

అభివృద్ధి సంక్షేమలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు సమిష్టిగా పని చేయాలి...

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాహుల్ రాజ్.

ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు వెల్లి విరియాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాంక్షించారు.
శుక్రవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్, డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, ఆర్డీవోలు నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూప్రాన్ జయచంద్రారెడ్డి,   సంబంధిత కలెక్టరేట్ సూపర్డెంట్ సంబంధిత జిల్లా అధికారులు, టిజి ఓస్, టీఎన్జీవోస్ నాయకులు కలెక్టరేట్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది  జిల్లా కలెక్టర్  ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ. అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధిని  వేగవంతం చేయాలని సూచించారు. WhatsApp Image 2025-01-03 at 9.01.35 PM (1)
 ప్రజలతో మమేకమవుతూ  సమస్యలు పరిష్కారానికి  చొరవ చూపాలని పేర్కొన్నారు. సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పూల బొకేలకు బదులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి అందించి పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలనే కాంక్ష అభినందనీయమన్నారు. నోట్ పుస్తకాలు పెన్నులు అందించిన అధికారులు అభినందించారు..  త్వరలోనే వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వివిధ శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .