జనవరి 4న జాబ్ మేళా నిర్వహణ ....
జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు
ప్రైవేట్ రంగం అయిన క్రెడిట్ యాక్సెస్ గ్రామీన్ లిమిటెడ్ కంపెనీలో ట్రైనీ కేంద్ర మేనేజర్ గా ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 4న శనివారం ఉదయం 10.00 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి) ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 ఉద్యోగ ఖాళీల భర్తీకి గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, ఎంపిక కాబడిన వారికి 12 వేల నుండి 17 వేల వరకు వేతనం ఉంటుందని, 18 నుండి 28 సంవత్సరాల వయస్సు గల పురుషులు, 18 నుండి 35 సంవత్సరాల మహిళ అభ్యర్థులు అర్హులని, ఎస్.ఎస్.సి., ఇంటర్, ఐ.టి.ఐ. ఏదేని డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన వారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు తమ విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Comments