సత్తుపల్లి పట్టణంలో ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ పిలుపు.

సత్తుపల్లి పట్టణంలో ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ పిలుపు.

IMG-20251010-WA0031సత్తుపల్లి, అక్టోబరు 10 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నియోజకవర్గం కేంద్రంగా ఓటర్ల హక్కులను రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటు హక్కు ఉల్లంఘనలను నివారించే సంతకాల ఉద్యమం శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. “మా ఓట్ల హక్కును రక్షించండి” అనే నినాదంతో ప్రజల నుండి సంతకాలను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల్లో తారుమారులు జరుగుతున్నాయని, పౌరుల హక్కులను ఉల్లంఘించే చర్యలను వెంటనే నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంతకాలను సేకరించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని దయానంద్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మాజీ కౌన్సిలర్లు దూదిపాల రాంబాబు, చల్లగుళ్ల నరసింహరావు, కమల్ పాషా, ఐ. శ్రీను, మానుకోట ప్రసాద్, పింగళి సామెలు, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుమారి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సందీప్ గౌడ్, మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .