క్షత గాత్రులను ఆసుపత్రిలో పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు రవి నాయక్
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
ఘనపూర్ మండలం, మాల్కిమియన్ పల్లి గ్రామంలో, కరెంటు తీగలను సరి చేసే క్రమంలో, విద్యుత్ స్తంభo విరిగి ఆముదం బండ తండాకు చెందిన సిద్దు కింద పడిపోయి చెయ్యి మరియు కాలు మేడిమే భాగం విరిగి పోయి నవని తెలిసినా వెంబడే, హాప్సిటల్ కి వెల్లి, స్నేహ సన్ షైన్ హాస్పిటల్ డాక్టర్ లతో మాట్లాడిన ముడావత్ రవినాయక్ మరియు కుటుంబ సభ్యులకు ధైర్యాని కలిగించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ శ్రీ బాలాజీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఘనపూర్ మండలం, ముందర తండాకు చెందిన కేతవత్ గోపాల్ నాయక్ ను, పరామర్ధించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా దిశ కమిటీ మెంబర్ మూడవత్ రవి నాయక్. ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడిన రవి నాయక్, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తో, ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి సానుకూల స్పందిస్తూ, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఇరువురి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారని రవినాయక్ అన్నారు.


Comments