చరిత్ర వక్రీకరించేందుకు కోందరి కుట్ర

యువత సాయుధ రైతాంగ పోరాట ప్రతిమను అలవరచుకోవాలి

చరిత్ర వక్రీకరించేందుకు కోందరి కుట్ర

IMG-20240909-WA0085సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల చరిత్రను వక్రీకరించి వారి ప్రయోజనాలను అనుకులాంగ చేసుకుంటున్నారని సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.రాష్ట్ర సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో 

ఈ నెల మొదటి తారీఖు నుండి 17 వ తారీఖు వరకు జరిగే సాయుధ పోరాట పాక్షోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రజానాట్యమండలి కళాకారులతో శౌర్య యాత్ర మండలంలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా వాళ్ళు మొదటగా కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన షేక్ బందగీ తన వ్యవసాయ భూమిపై 

విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి పై కోర్టు కేసు గెలిచి ఇంటికి వస్తుండగా స్వగ్రామంలో దేశ్ముఖ్ గుండలు హతమార్చరు.ఆయన స్మారక స్థూపానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కడవెండి గ్రామంలో వాడవాడన డప్పుచప్పుల్లతో కళాకారులు ఆమరుల త్యాగలను స్మరించారు.గ్రామంలోని దొడ్డి కొమరయ్య స్మారక స్థూపంకు,విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సింగారపు రమేష్ అధ్యక్షతన సభను ఏర్పాటు చేయగా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ నిజాం నవాబు ఆదేశాల మేరకు రాజకార్లు,దోరల ఆగడాలపై ఎర్రజెండా పట్టి మొదట తిరుగుబాట పట్టింది ఈ ప్రాంతంలో నే అని అన్నారు షేక్ బందగీ,దొడ్డి కొమరయ్య ,చాకలి అయిలమ్మ,కాసం కృష్ణమూర్తి మరెందరో ఈ గడ్డపై ఎర్రజెండా పట్టి తిరుబాట చేశారు.వారి పోరాట ప్రతిమ,చరిత్రను నేటి యువతరం తెలుసుకోని ప్రభుత్వాలను ఎండగట్టాలని అన్నారు.కేంద్రంలో బిజెపి ట్యాక్సుల ద్వారా ప్రజల నడ్డి విరస్తుందని ,రాజ్యాంగాన్ని మార్చాలన్నా ఆలోచన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.అదే విధంగా రాష్ట్రంలో ఎ తారతమ్యం లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలని అన్నారు.గత ప్రభుత్వం తోమ్మిది న్నర సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు గడుస్తున్నా రేషన్ కార్డుల పక్రియనే లేదనే,ఆరు గ్యారెంటీల విషయంపై స్పష్టత లేదని అవి అమలు ఆయ్యే వరకు మా పోరాటం అగదని అన్నారు.ప్రజా పోరాటంలో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మంది నిరుపేదల ఇండ్ల స్థలాల కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.కొందరు పని కట్టుకుని ఎర్రజెండాల పని అయిపోయిందని అంటున్న నాయకులకు ఒక్కటే మాటగా దోపిడీ ,దౌర్జన్యం ఉన్నని రోజులు ఎర్రజెండాలు ఉంటాయని అన్నారు.ఈ నెల 17 వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభకు సిపిఐ(ఎం )కేంద్ర కమిటీ సభ్యుడు రాజస్థాన్ సికార్ ఎంపీ అమ్రారాం ముఖ్య అతిథిగా పాల్గొంటారని కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంను నాటిక ప్రదర్శన చేపట్టి ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం యాదగిరి ,గోడిశాల రాములు ,సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్ల జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న ,సిపిఐ నాయకుడు బెజగం ఎల్లయ్య ప్రజానాట్యమండలి కళాకారులు వేల్పుల వెంకన్న ,యంజె వినోద్ ,బూర్గుల ప్రభాకర్ ,నాంపల్లి చంద్రమౌళి ,పిడమర్తి అశోక్ ,చింతల విజయ,చాముండేశ్వరి,మానస,హరిత ,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .