నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా

 
WhatsApp Image 2024-12-08 at 9.29.09 PM
 
WhatsApp Image 2024-12-08 at 9.29.32 PM
మడికొండ/స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
 
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నియోజకవర్గంగా మారుస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకానికి ప్రతిఫలంగా అభివృద్ధి పనులకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
 
ఒక్క ఏడాదిలోనే రూ. 750 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు
గత సంవత్సర కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 750 కోట్ల విలువైన పనులకు ఆమోదం పొందినట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. ముఖ్య అభివృద్ధి ప్రాజెక్టులు:
 
• యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్: రూ. 200 కోట్లతో విద్యారంగ అభివృద్ధి.
• 100 పడకల ఆసుపత్రి: రూ. 45 కోట్లతో మెరుగైన వైద్య సేవల అందుబాటు.
• ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్: రూ. 26 కోట్లతో నిర్మాణం.
• రైతులకు సాగు నీటికి సౌకర్యం: రూ. 148 కోట్లతో నవాబ్ పేట రిజర్వాయర్ మెయిన్ కెనాల్ సిసి లైనింగ్.
• డిగ్రీ కళాశాల: రూ. 30 కోట్లతో.
• ఇందిరమ్మ ఇళ్లు: పేదల కోసం అదనంగా 5,000 ఇళ్లు, రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మాణం.
• గ్రామీణ అభివృద్ధి: రూ. 10 కోట్లతో కమ్యూనిటీ హాలులు, సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు.
• మల్లన్నగండి రోడ్: రూ. 15 కోట్లతో పీ.ఆర్. రోడ్డు నిర్మాణం.
 
ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించిన కడియం శ్రీహరి, కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, రికార్డు స్థాయి వరి దిగుబడులు కాంగ్రెస్ పాలనలో సాధ్యమయ్యాయని వివరించారు.
 
డాక్టర్ కడియం కావ్య వ్యాఖ్యలు
 
స్టేషన్ ఘనపూర్ తన పుట్టినిల్లు అని పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. వరంగల్ సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, రూ. 5,000 కోట్ల నిధులు మంజూరు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
 
 
కాంగ్రెస్ బలోపేతానికి పిలుపు
 
కడియం శ్రీహరి, కడియం కావ్యల నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బముగా మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ తదితర నూతన పదవీధారులకు సన్మానం చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .