చదువులలో ప్రతిభ కనబరుస్తున్న గిరిజన బిడ్డలకు సహకారం అందిస్తా
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఉన్నత చదువులలో ప్రతిభ కనబరుస్తున్న గిరిజన విద్యార్థులకు అండగా ఉంటూ, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
గ్రూప్–1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికైన దిరావత్ సబితను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌తో కలిసి నాగార్జున నగర్‌లోని ఆమె నివాసంలో శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గిరిజన విద్యార్థులు ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపడం సమాజానికి గర్వకారణం. సబిత విజయాన్ని చూసి మరెందరో యువత ప్రేరణ పొందుతారు. ఇలాంటి ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలి” అని అన్నారు.డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు సానుకూలమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలని ఆమెకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి, పాండాల శివకుమార్ గౌడ్, సారా వినోద్ ముదిరాజ్, శ్రీశైలం, ప్రసాద్ రెడ్డి, జై కృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


Comments