బస్తీలో సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ శాంతి సాయిజెన్ పాదయాత్ర
Views: 4
On
నాచారం,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్ ఎరుకల బస్తిలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా భూగర్భ డ్రైనేజీ, రహదారుల సమస్యలను సమీక్షించారు. ఇప్పటికే కొంతవరకు పూర్తయిన పనులను పరిశీలించి, ఇంకా అవసరమైన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను గుర్తించారు. వీటి కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు కార్పొరేటర్ ఆదేశాలు ఇచ్చారు.
డివిజన్‌లోని అన్ని కాలనీల్లో, ముఖ్యంగా శ్రీరామ్‌నగర్ మరియు ఎరుకల బస్తిలో రహదారులు, డ్రైనేజీలు త్వరలోనే నిర్మించబడతాయని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సిరాజుద్దీన్, ఎఈ వినీత్ విజయ్ కుమార్, శివ, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments