బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

కాప్రా, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మీర్‌పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో ని నోమా కళ్యాణ మండపం నుండి రైల్వే ట్రాక్ వరకు ఇటీవల చేపట్టిన బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, “ఈ బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణం పూర్తయితే వర్షం నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది” అన్నారు.పనుల నాణ్యతను పరిశీలిస్తూ అధికారులు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ లింగారావు, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, శ్రీనివాస్, స్థానిక నాయకులు సాయి కుమార్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .