నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ కు వినతి కార్పొరేటర్
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
నాచారం డివిజన్ సమస్యల పై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ని కలిసిన వినతి పత్రం అందజేసిన నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్.
నాచారం డివిజన్ లో ని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు విషయమై చర్చించడం జరిగింది. నూతన వార్డు కార్యాలయానికి లిఫ్ట్ ఏర్పాటు. హిందూ స్మశాన వాటికను వైకుంఠధామముగా తీర్చిదిద్దుట. రైతు బజార్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణము. పి ఎస్ టి కాలనీకి మంజూరైన 20 లక్షల రూపాయల సిమెంటు రోడ్డు పనులు తిరిగి రీవాల్యుయేషన్ చేయాలని. బాబా నగర్ లోని రెడ్డి స్మశాన వాటికలో అభివృద్ధి పనుల విషయమై.
పటేల్ కుంట చెరువు సుందరీ కరణ , అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగింది.
పైన తెలిపిన అన్ని అభివృద్ధి పనులకు జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది.


Comments