అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్
బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్
చిల్కానగర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
చిల్కానగర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు.జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం మరియు వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి రాఘవేంద్ర నగర్, సాయిరాం నగర్, ధర్మపురి, బీరప్పగడ్డ ప్రాంతాల్లో జరుగుతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పైప్ లైన్, సీవరేజ్ పైప్ లైన్ మరియు సీసీ రోడ్ల పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ — ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.రాఘవేంద్ర నగర్ మరియు సాయిరాం నగర్ కాలనీల్లో రూ.25 లక్షల వ్యయంతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పైప్ లైన్ పనులు, ధర్మపురి మరియు సాయిరాం నగర్ కాలనీల్లో రూ.14 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు, బీరప్పగడ్డ మరియు ధర్మపురి కాలనీల్లో రూ.24 లక్షల వ్యయంతో సీవరేజ్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వాటర్ వర్క్స్ ఏఈ సత్యనారాయణ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు కేదార్, ఉపేందర్,
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎదుల కొండల రెడ్డి, కోకొండ జగన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, పలే వేణు గౌడ్, మార్క శ్రీను, గణేష్, చిన్న, సత్యనారాయణ, జంగయ్య యాదవ్ మరియు వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


Comments