ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ధర్మయుద్ధం
మాదిగ నాయకుల ఉద్యమ పిలుపు
Views: 4
On
ఎల్కతుర్తి,తెలంగాణ ముచ్చట్లు:
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నాయకులు ధర్మయుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 21న నిర్వహించనున్న మాదిగల ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం అంబాలా సంపత్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జాతీయ నేతలు మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న కాపు, బొడ్డు దయాకర్ మాదిగ హాజరయ్యారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం:
ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అంగీకారం తెలుపుతూ, అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నాలుగు నెలలు గడిచినా ఈ విషయంలో ఏ చర్యలు తీసుకోకపోవడం మాదిగ సమాజంపై చిత్తశుద్ధి లేనిదేనని నాయకులు మండిపడ్డారు.
మాదిగ ఉద్యమానికి పిలుపు:
మాదిగ నాయకులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని, గ్రామ స్థాయిలో మండల సంఘాల పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. “మందకృష్ణ మాదిగ” నాయకత్వంలో అఖండ ఉద్యమానికి శ్రీకారం చుడతామని వారు వెల్లడించారు. తెలంగాణలో మాదిగల సామాజిక హక్కుల సాధన కోసం లక్షలాది మందితో మహాసభను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
మండల కమిటీ నియామకం:
ఈ సమావేశంలో ఎల్కతుర్తి మండల ఎమ్మార్పీఎస్ కమిటీని నియమించారు:• అధ్యక్షులు: ఈరా రమేష్ మాదిగ
• ప్రధాన కార్యదర్శి: అడ్డూరి అనిల్ మాదిగ
• ఉపాధ్యక్షులు: బొంకూరి కార్తీక్ మాదిగ
• కార్యదర్శి: ఎల్తూరి సురేష్ మాదిగ
ఈ కార్యక్రమంలో అంబాల రవి మాదిగ, గద్దల సుకుమార్ మాదిగ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక హక్కుల సాధనకు ఇదే తుదిపోరాటమని వారు శపథం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments