బలవంతపు మార్టిగేజ్‌తో దళిత దంపతుల ఇల్లు విక్రయం
మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ–ఎస్టీ కమిషన్ వద్ద విన్నపం
-జవహర్‌నగర్ పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
-రాచకొండ పోలీస్ కమిషనర్‌కు కమిషన్ ఆదేశాలు
దమ్మాయిగూడ,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడకు చెందిన దళిత దంపతులు యాదగిరి, స్వరూపలు తమ ఇల్లు బలవంతంగా మార్టిగేజ్ చేయించి 50 లక్షలకు విక్రయించిన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు.
బాధితులు కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య, సభ్యులు కె.లక్ష్మీనారాయణలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆధ్వర్యంలో బాధితులు తమ వేదనను వివరించారు.
రిటైర్డ్ ఉద్యోగి అయిన తాను అప్పు అవసరం లేదని చెప్పినా, మార్వాడీ వ్యాపారి రామ్ దేవ్ బాటియా తన రౌడీలను పంపి ఇల్లు సంబంధించిన పత్రాలను బలవంతంగా తీసుకెళ్లి మార్టిగేజ్ చేసి, అనంతరం 50 లక్షలకు విక్రయించాడని బాధితుడు యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు.ఈ విన్నపంపై స్పందించిన ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Comments