మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించిన దమ్మపేట స్వేచ్ఛా ప్రెస్ క్లబ్

మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించిన దమ్మపేట స్వేచ్ఛా ప్రెస్ క్లబ్

భద్రాద్రి (కొత్తగూడెం),తెలంగాణ ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని స్వేచ్ఛా ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా, రిపోర్టర్ తంబళ్ల రవి మాట్లాడుతూ, మీడియా పై దాడి చేసిన మంచు మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన జర్నలిస్ట్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కోరారు.

మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలను ఎవరైనా చేసినా క్షమించదగినవి కాదని, వెంటనే మంచు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గంగాధర్ శ్రీను, కారం నాగేంద్ర, తంబళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .