డిప్లొమో ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో విజయ దుంధుబి మ్రోగించిన దరిపల్లి కళాశాల
Views: 2
On
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
శుక్రవారం విడుదల చేసిన పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిప్లొమో ఫలితాలలో దరిపల్లి అనంతరాములు కళాశాల డిప్లొమ విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించినారు.సి.ఎస్.సి బ్రాంచ్ నందు పి.స్పందన, మైనింగ్ బ్రాంచ్ నందు షేక్ అమీర్ పాషా, సివిల్ బ్రాంచ్ నందు హీనా హర్షద్, డిప్లమో మొదటి సంవత్సరం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లో మహమ్మద్ బురానిద్దీన్ కళాశాల నుంచి మొదటి వరుసలో నిలిచారు.డిప్లొమలో జాయిన్ అయిన సామాన్య విద్యార్థిని విద్యార్థులకు నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కళాశాల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఘనత సాధించిన డిప్లొమ విద్యార్థిని విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, కళాశాల అకాడమిక్ ఇంచార్జ్, బోధన, బోధనేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments