కత్తి పోటులో గాయపడిన సుదర్శన్‌కి దయాకర్ రెడ్డి పరామర్శ
Views: 9
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
సాయిగణేష్ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువకుడు మెడికంటి రాజవర్ధన్ రెడ్డి అలియాస్ అర్జున్ రెడ్డి మద్యం మత్తులో గురువారం రాత్రి ఆ కాలనీ సెక్రటరీ మెరుగు భాస్కర్‌తో అకారణంగా వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆ గొడవను ఆపాలని ప్రయత్నించిన సుదర్శన్‌పై రాజవర్ధన్ రెడ్డి కత్తితో పొట్టపై, వీపుపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో సుదర్శన్‌కు తీవ్ర రక్తస్రావం జరిగింది. గాయపడిన సుదర్శన్‌ను శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments