ఇరుముడి కార్యక్రమములో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ 

ఇరుముడి కార్యక్రమములో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

 కారేపల్లి మండలం గిద్దవారిగూడెంలో ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం మండ్రు పుల్లయ్య గురుస్వామి, కేలోత్ రవి గురు స్వామి  ల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ పాల్గొని స్వాములందరకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములను ఉద్దేశించి వారు మాట్లాడుతూ నలభై రోజులు కఠినదీక్షతో ఏకభుక్తo తో, కటిక నేలపై పడుకుని, పాదరక్షలు లేకుండా తమ వృత్తి ధర్మాన్ని మరువకుండా  ఉండి శబరిమలై యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా అందరికీ, అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డేగల ఉపేందర్, బొబ్బలు ఉపేందర్,గోపికృష్ణ గురు స్వామి, డేగల కృష్ణ గడ్డమీది లింగయ్య, కన్నబోయిన ఉపేందర్ రామారావు శేఖర్ వెంకటేష్, రాము నవీన్ వినోద్ రాజేష్ గణేష్ లోకేష్ ఆదినారాయణ నవీన్ కృష్ణమూర్తి నగేష్ రాము మరియు అయ్యప్ప స్వాముల బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .