ఎస్సీ ఫెడరేషన్  ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడకలు

ఎస్సీ ఫెడరేషన్  ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడకలు

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

  శ్రీరంగాపూర్ మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా నందు శుక్రవారం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకలు.... శ్రీరంగాపూర్ మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ పర్వతాలు  ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా ఎస్సి ఫెడరేషన్ కన్వీనర్ బి .రమేష్ మరియు శ్రీరంగాపూర్ మండల బిసి నాయకులు శ్రీహరి రాజు, బీసీ నాయకులు బిచ్చన్న  మరియు హమాలి సంగం  సభ్యులు చిన్న అయ్యన్న అంబేద్కర్ గారి విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్య అతిథులు బీసీ నాయకులు శ్రీహరి రాజు  మాట్లాడుతూ ..డిసెంబర్ 6 బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఒక బ్లాక్ డే అని, భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నంతవరకు , మనం మన హక్కులు సాధించే వరకు  అంబేద్కర్  మన అందరిమధ్యలో ఎల్లకాలం జీవించి ఉంటారని , రాజ్యాంగ ఫలాలు , రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి చెందాలని , బహుజన రాజ్యాధికారమే అంబేద్కర్ యొక్క ఆశయమని శ్రీహరి రాజు  మాట్లాడడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో  బీసీ నాయకులు శ్రీహరి రాజు, బుచ్చన్న, చుక్క నాగన్న,గుంటి నాగన్న, పిల్లికండ్ల వెంకటయ్య,  పసుల రాముడు, శివకుమార్ నాయుడు,  మరియు ఎస్సీ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బి.రమేష్,, శ్రీరంగాపూర్ మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ జె. పర్వతాలు, మండల ఎస్సీ ఫెడరేషన్ సెక్టార్ కన్వీనర్  జె .ఆశన్న,  మండల యూత్ కన్వీనర్ బి. సంపత్ కుమార్,  శ్రీరంగాపూర్ పట్టణ కన్వీనర్ కె .రవి,  పట్టణ ప్రధాన కార్యదర్శి  జె .లక్ష్మణ్, పట్టణ కోశాధికారి జె. రాముడు, పట్టణ యూత్ కన్వీనర్ జే. వంశీ కుమార్, పట్టణ సెక్టార్ కన్వీనర్ పి.శ్రీనివాసులు, పట్టణ సెక్టార్ ప్రధాన కార్యదర్శి కె .శ్రీనివాసులు , ఎస్సీ ఫెడరేషన్  సభ్యులు కే నాగరాజ్, జె. రవి కుమార్ మరియు హమాలి సభ్యులు చిన్న అయ్యన్న, శ్రీనివాసులు, జల్లాపురం నాగన్న, ట్రాక్టర్ బిసన్న, ఏ కురుమన్న, ఎల్లయ్య, కే నరసింహ, గూడెం భూషన్న, కె రాముడు, జె ఎల్లస్వామి, బండలయ్య,  ధర్మరాజు, జె. కృష్ణయ్య,, ఎన్ .బాలు, జె. అర్జున్ మరియు ఎస్సీ కాలనీ వాసులు లెక్చరర్ జె. కురుమూర్తి, ఎన్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .