ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏబిసిడి వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి షమీం అక్తర్‌ను మాదిగ ప్రతినిధులు కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కాయిత బిక్షపతి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాదిగ నాయకులు, ఉపకులాల ప్రతినిధులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.వర్గీకరణలో మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, ఇతర రంగాలలో సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు. మాదిగ సమాజానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ మద్దతును తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .