పేకాట రాయుళ్ళను  అరెస్ట్ చేసిన ధర్మసాగర్ పోలీసులు 

పేకాట రాయుళ్ళను  అరెస్ట్ చేసిన ధర్మసాగర్ పోలీసులు 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

ధర్మసాగర్ మండలంలోని మలక్‌పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం ఆధారంగా పోలీసులు శనివారం నిర్వహించిన రైడ్‌లో ఎనిమిది మంది పేకాట ఆడుతుండగా, వారిలో ముగ్గురు పారిపోయారు.పోలీసులు పట్టుబడిన వారి వద్ద నుంచి 104 ప్లేయింగ్ కార్డులు, ₹11,170 నగదు, నాలుగు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడినవారు మలక్‌పల్లి గ్రామానికి చెందిన మానుపాటి వెంకన్న, మానుపాటి సంపత్, మానుపాటి రాజశేఖర్, కొలిపాక నాగరాజు, మడ్డి మధు. పారిపోయినవారిలో అయినవోలు మండలం కనపర్తి గ్రామానికి చెందిన నాతి చందు, ఇలా సారపు హరిప్రసాద్, మలక్‌పల్లి గ్రామానికి చెందిన మానుపాటి హరి ఉన్నారు.ఈ దాడిలో ఎస్ఐ జానీ పాషా, ఎస్సై నరసింహారావు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .