డిజిల్ లోకో షెడ్ ముందు ధర్నా

డిజిల్ లోకో షెడ్ ముందు ధర్నా
ఫోటో రైట్ అప్స్ ధర్నా చేస్తున్న రైల్వే కార్మికులు

 కాజీపేట్ సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

 సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో  కాజీపేటలోని డిజిల్ లోకో షెడ్ ముందు శుక్రవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ధర్నాల్లో భాగంగా పెద్ద ఎత్తున డీజిల్ లోకో షెడ్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ అధ్యక్షులు కామ్రేడ్ ఎస్కే. జానీ మియా బ్రాంచ్ కార్యదర్శి పాక వేద ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు, ఏఐఆర్ఎఫ్ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ కాల్వ  శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఎనిమిదవ వేతన సంఘం అమలును వెంటనే చేయాలని అన్నారు. విలువలతో కూడిన వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించి జనవరి20 26 సంవత్సరం నుండి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎనిమిదవ వేతన సంఘాన్ని త్వరగా అమలు చేయకుంటే భవిష్యత్తులో కార్యాచరణలో కార్మికులు దేనికైనా సిద్ధంగా ఉంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వరరావు, ఆఫీస్ బేరర్ భాస్కర్ రెడ్డి, నాగరాజు, యాదగిరి, సత్యనారాయణ, యాదగిరి, నరేష్ యాదవ్, శ్రీనివాస్, గాంధీ ,పాక రవి, రజాక్, వి శ్రీనివాస్ డీజిల్ ఇన్స్టిట్యూట్ కమిటీ మెంబర్స్ అంతయ్య, రాముల సదానందం ,శివకుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .