స్థానిక ఎన్నికల విజయానికి బిఆర్‌ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

స్థానిక ఎన్నికల విజయానికి బిఆర్‌ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం

వనపర్తి,అక్టోబర్5(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దమందడి మండల బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల విజయానికి బిఆర్‌ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలనతో పోల్చి, 2 సంవత్సరాల విధ్వంస పాలన ప్రజలను విసిగింపజేసిందని పేర్కొన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేయకుండా ప్రజలను హరించడంలో కొనసాగుతున్నారని తెలిపారు. అయితే, కె.సి.ఆర్ సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో సృష్టించిన అభివృద్ధి మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాగితాలకు పరిమితం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.మాజీ మంత్రి సింగిరెడ్డి పిలుపునిచ్చారు. – కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను విస్తృతంగా ప్రచారం చేసి, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని.ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, విజయ్ కుమార్, వేణు యాదవ్, నాగేంద్రం యాదవ్, సేనాపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .