సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ఖమ్మం  బ్యూరో, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు)

తిరుమలాయపాలెం మండలానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పిస్తూ సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం అందజేసింది.  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన  కార్యక్రమంలో 54 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, బోడా మంగీలాల్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, వున్నం రాజశేఖర్, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు భరోసా కల్పించేలా పలు సంక్షేమ చర్యలు చేపట్టిందని, ముఖ్యంగా వైద్య ఖర్చులు భరించలేని పేదల కోసం సీఎంఆర్ఎఫ్ నిధులను వేగంగా అందజేస్తోందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలబడటం.... ఒక్కో కుటుంబానికి నమ్మకం కల్పించడం తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
సీఎంఆర్ఎఫ్ సహాయం పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .