ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ నేతలు కొప్పుల చంద్రశేఖర్, బొర్రా రాజశేఖర్
* 54మందికి రూ.13.81 లక్షల మేరకు లబ్ధి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ ఎంఆర్ఎఫ్) చెక్కులను శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు అందజేశారు. నగరంలోని గట్టయ్య సెంటర్లో గల క్యాంప్ ఆఫీసులో 54 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, బొర్రా రాజశేఖర్ పంపిణీ చేశారు. తద్వారా మొత్తం రూ. 13లక్షల 81,500 మేరకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కొప్పుల చంద్రశేఖర్, బొర్రా రాజశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదల పక్షాన నిలుస్తోందని తెలిపారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తోందని, ఆపత్కాలంలో అండగా నిలుస్తోందని అన్నారు. ఆరోగ్య భరోసానందిస్తూ.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను.. సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూస్తోందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు.. మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ ఏన్కూరు మండలాధ్యక్షులు స్వర్ణ నరేందర్, కూసుమంచి మండలాధ్యక్షులు మట్టె గురవయ్య, నాయకులు కోసూరి శ్రీను, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, మైనారిటీ నాయకులు ఇమామ్ భాయ్, చల్లా రామకృష్ణారెడ్డి, కన్నెబోయిన సీతారాములు, రాయల పుల్లయ్య, మోషే, ఎయిర్టెల్ నరసింహారావు, కాంపాటి రమేష్, బోడ శ్రావణ్, సురేష్ నాయక్, ఇమ్మడి తిరుపతిరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


Comments