రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్నేరు పరివాహక ప్రాంత వరద బాధితులకు నిత్యావసరాలు, గృహ సామాగ్రిని బుధవారం పంపిణీ చేశారు. వరద ముంపుకు తీవ్రంగా గురైన రాకాసి తండా, జల్లేపల్లి, కరుణగిరి ప్రాంతాల్లో కిరణ్ పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. సుమారు 500 పైగా కుటుంబాలకు కావాల్సిన దుప్పట్లు, వంట గిన్నెలు, చాపలు, ఆహారపోట్లలు , మంచినీటి పాకెట్లను బాధితులకు అందించారు. పొంగులేటి శ్రీనన్న పిలుపుతో జిల్లా వ్యాప్తంగా తమ రైట్ ఛాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో బాధితులకు కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాలను పంపిణీ చేస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనురాధ, లక్ష్మి, శ్రావణ్, అరవింద్, రాజు, రియాజ్ పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .