జిల్లా పరిషత్ పాఠశాలలో నోట్‌బుక్స్ పంపిణీ

జిల్లా పరిషత్ పాఠశాలలో నోట్‌బుక్స్ పంపిణీ

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సత్తుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కీ.శే. మట్టా ఆరోగ్యమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

“నేను కూడా ఈ పాఠశాలలోనే చదివాను. ఇక్కడి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు పాఠశాల పేరు మీద రూ. 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నిర్ణయించుకున్నాను,” అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, దొడ్డా శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఫయాజ్, మానుకోట ప్రసాద్, విజయ సారధి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .