వరద బాధితులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో అతలాకుతలమైన ఖమ్మం పట్టణంలోని జలగం నగర్ లోని వరద బాధితులకు బియ్యం, నూనె, పప్పులు, కారం, పుసుపు, చింతపండు, పంచదార ఇతర నిత్యావసర సరుకులతో పాటుగా, చాపలు, బ్లాంకెట్స్ జమాఅతె ఇస్లామి హింద్ ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రిజినల్ ఆర్గనెజర్ హఫ్సా మేహ్వీన్ పట్టణ పట్టణ అధ్యక్షురాలు ఖదిజతుల్ కుబ్రా అందజేశారు. ఈ సందర్భంగా అస్ఫీయ అన్జుమ్ మాట్లాడుతూ సర్వం కోల్పోయి బురదలో కూరుకుపోయిన ఇండ్లు ఎటు చూసిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నారు వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వరద బాధితులను పలకరించి మానసిక మనో ధైర్యాన్ని నింపారు . ఖమ్మం కు ఇంతటి విపత్తు రావడం చాలా బాధాకరమని లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు నస్రీన్ హాజీరా సదఫ్, ఫర్జానా, అర్శియ, ఫరీన్ అఫ్శా తదితరులు పాల్గొన్నారు


Comments