సింగపురం అమృతయ్య 12వ వర్ధంతి సందర్భంగా పేదలకు చీరల పంపిణీ

సింగపురం అమృతయ్య 12వ వర్ధంతి సందర్భంగా పేదలకు చీరల పంపిణీ


WhatsApp Image 2024-12-15 at 1.51.50 PM

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిరా భర్త  కీర్తిశేషులు సింగపురం అమృతయ్య 12వ వర్ధంతి వేడుకలు ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్మల మాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి,అమృతయ్యకు ఘన నివాళులు అర్పించారు.అనంతరం పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరా మార్గదర్శకంలో జరిగింది.ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ అగస్టిన్, మాజీ ఎంపీటీసీ ఫోరమ్ మండల అధ్యక్షుడు సింగపురం దయాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, చర్చి సిస్టర్స్, సంఘం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .